Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4303

ఎవ్వరికి విన్నప మిఁకనేల

రాగము: శంకరాభరణం

ఎవ్వరికి విన్నప మిఁకనేల
యివ్వల నీ దయ యింతటఁ గలది॥పల్లవి॥
  
  
మనసునఁ బెనగొనుమాటల కేకా
తనవునఁ దమకము తతిగొనెను
ననువున నుండిన నయములకేకా
కనుఁగొనఁ జూపులు కడిమీఁ జెలికి॥ఎవ్వ॥
  
  
నంటునఁ గొసరిననవ్వుల కేకా
జంటల నిట్టూర్పు సతమాయ
అంటుముట్టు అడియాసకేకా
మెంటునఁ జెమటలు మిక్కిలిఁ బొలసె॥ఎవ్వ॥
  
  
కూడిన తొల్లిటి కూటముల కెకా
వీడని వేడుక వెసఁ నలిగె
యీడనె శ్రీ వేంకటేశ కలిసితివి
నీడలఁ గాంతకు నిర్మలమాయ॥ఎవ్వ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!