Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4606

ఎంత నాకుఁ జనవిచ్చి యియ్యకొనీనే తాను

రాగము: ముఖారి

ఎంత నాకుఁ జనవిచ్చి యియ్యకొనీనే తాను
మంతనాన యిట్టె నన్ను మన్నించీఁ గాక॥పల్లవి॥
  
  
మనసులు సోదించి మాఁటలాడేదాననా
తనయిచ్చలో మెలఁగేదానఁ గాక
కొనచూపులనుఁ జూచి కొసరేలిదాననా
వినయాన వేఁడుకొని వెలసేదానఁ గాక॥ఎంత॥
  
  
నాలిఁ బెట్టి తనతో నే నవ్వేటిదాననా
తాలిమితో సేవ సేసేదానఁ గాక
చాలుకొని బొమ్మలను జంకించేటిదాననా
మేలుమీఁదిదాననై మెచ్చేటిదానఁ గాక॥ఎంత॥
  
  
యిమ్ములఁ దనకు విడె మిచ్చేటిదాననా
తమ్ములము తన్నడిగేదానఁ గాక
నెమ్మది శ్రీవేంకటాద్రినిలయుఁడు నన్నుఁ గూడె
చిమ్మిరేఁచేదాననా చేతిలోదానఁ గాక॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!