Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4746

ఎంతలేదన్నా నవి ఏల మానీని

రాగము: నాదరామక్రియ

ఎంతలేదన్నా నవి ఏల మానీని
చెంతల నీ వేడుకలు చెల్లింతువుగాక॥పల్లవి॥
  
  
పఱపుపై నీకు నాపె పాదములు గుద్దఁగాను
తఱితోడి వలపులు దైవారవా
నెఱి సురటి విసరి నిన్ను నిట్టె చూడఁగాను
గుఱిలేనికోరికలు గుబ్బతిలవా॥ఎంత॥
  
  
వేసరక సారెసారె విడెము నీ కియ్యఁగాను
ఆసలు నీమతిలోన నల్లుకొనవా
రాసికెక్క నీతో సరసములెల్లా నాడఁగా
పోసరించి తమకము పారిఁ బిక్కటిల్లదా॥ఎంత॥
  
  
పాయక యేపొద్దు నాపె పక్కనే పండుండఁగాను
ఆయాలంటి పరవశమందదా మేను
యీయెడ శ్రీవేంటేశ యేలితివి నన్ను నేఁడు
చాయల నీజవ్వనము సఫలము గాదా॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!