Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4843

ఎంత వేసరించవచ్చు యేపొద్దు నిన్ను

రాగము: ముఖారి

ఎంత వేసరించవచ్చు యేపొద్దు నిన్ను
పంతగాఁడ నీ చిత్తము భాగ్యము నాది॥పల్లవి॥
  
  
నిచ్చ నిచ్చ నీకు నవ్వు నేరుపఁగఁగలనా
కచ్చు పెట్టి నీయంతనే కలితేఁగాక
మెచ్చులుగా వలపులు మెడఁగట్టఁగలనా
పచ్చిగా నాయందు నీకు బత్తి గలితేఁగాక॥ఎంత॥
  
  
వొడివట్టి నిన్నొద్దఁ గూచుండఁ బెట్టఁగలనా
బడి నీయంతనే నన్నుఁ బైకొంటేఁగాక
గుడిగొనఁ జెమటలు కురియించఁగలనా
కడలేని తమితోడ గరఁగితేఁగాక॥ఎంత॥
  
  
మలసి బలిమిచేసి మరిగించఁగలనా
చెలిమి నీయంతనే చేసితేఁగాక
యెలమి శ్రీవేంకటేశ అలమేల్మంగనై నేను
కలసితి నింకా నీవే కరుణింతు గాక॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!