Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4916

ఎందరులేరు నీకు నేనేమి బాఁతెయ్యా

రాగము: హిందోళం

ఎందరులేరు నీకు నేనేమి బాఁతెయ్యా
అంది నాపైఁ జెయివేసేవు అట్టె కానీవయ్యా॥పల్లవి॥
  
  
అలిగి నేరాఁగానే అట్టె నావెంట విచ్చేసి
యెలమిఁ బైకొనేవు నేనేమి బాఁతెయ్యా
పలుకకుండఁగ నన్నుఁ బచరించి పచరించి
యెలుఁగిచ్చి మాటాడేవెంత సేసేవయ్యా॥ఎందరు॥
  
  
ముసుఁగు వెట్టుకుండఁగ ముచ్చటతోఁ గొంగుదీసి
యిసుమంత నవ్వేవు నేనేమి బాఁతెయ్యా
విసుగుచునున్న నన్ను వేఁడుకొని నీవు నాకే
వసమై పాయవు ఇంతవలెనా నాకయ్యా॥ఎందరు॥
  
  
ఆదననేఁ బండుండఁగ నండ నీవూఁ బవళించి
యిదె కాఁగిలించేవు నేనేమి బాఁతెయ్యా
వుదుటు శ్రీవేంకటేశ వొగినలమేలుమంగఁ
నిదివో నన్ను గూడితి వెంతవాఁడవయ్యా॥ఎందరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!