Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6556

కద్దు లేదనఁగ నేల కమ్మటిఁ దాను

రాగము: మాళవిగౌళ

కద్దు లేదనఁగ నేల కమ్మటిఁ దాను
యిద్దరు సతుల పొందూ నీడేరె ననవే॥పల్లవి॥
  
  
సందడినాపెతోడ సరసము లాడీఁ దాను
అందుకు నాతో మాట లాడు మనవే
గొందిఁ జిక్కించుక మిమ్ము గుట్టున నొడఁ బరచీ
కందువ నేఁదెలి పే నిక్కడికి రమ్మనవే॥కద్దు॥
  
  
ఎట్టిదో ఆపెగురుతు యెఱఁగ ననీఁ దాను
చుట్టమైన దీకె మోము చూడు మనవే
మట్టుమీర నవ్వి మిమ్ము మాఁటాలు మరపించీని
పట్టితిఁ దనలేక లంపఁగా విను మనవే॥కద్దు॥
  
  
తనదేవులై వుండఁగాఁ దలఁచుకొనీఁ దాను
గొనకొని యింకా నేల కూడు మనవే
నను నేలె మిమ్ముఁ జూచి నగీ శ్రీవేంకటేశుఁడు
పనిలేనిచలములు పట్టఁగ వద్దనవే॥కద్దు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!