Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6570

కనుమూసెఁ గదె దీని గరువంపుఁ దెలివి

రాగము: బౌళి

కనుమూసెఁ గదె దీని గరువంపుఁ దెలివి
చనుదోయి పైకొంగు జారిన నెఱుఁగదు॥పల్లవి॥
  
  
తలకెక్కెఁగదె దీని తనువికారములు
పొలుపైన నెరులు కొప్పున జారెను
చలి ముంచెఁగదె దీని జవ్వనపు మదము
పులకజొంపములచేఁ బొరలెక్కె మేను॥కను॥
  
  
వడదాఁకెఁగదె దీని వాల్ గన్నుఁగొనలు
చిడుముడి ముచ్చటతో సిగ్గువడీని
బడిదప్పెఁ గదె దీని పలుకుఁదేనియలు
తడఁబాటుతోడ చిత్తము దాఁచెనిపుడు॥కను॥
  
  
కసరెక్కెఁగదె దీని కస్తూరి చెమట
అసలుఁ గుంకుమ తోడ నలరీని మేన
ఉసురెక్కెఁగదె దీని యొరుపు నూరుపుల
పొసఁగి వేంకటపతి పొందు దెలిపెడిని॥కను॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!