Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7027

కూరుములూఁ గొసరేవు గుంపెనలూఁ జూపేవు

రాగము: నాదరామక్రియ

కూరుములూఁ గొసరేవు గుంపెనలూఁ జూపేవు
ఆరితేరినదానవు ఆయా లంట రాదా॥పల్లవి॥
  
  
చనవుగలదానవు సణఁగులు రాల్చనేలే
చెనకరాదా విభునిఁ జేతులారాను
వినయపు దానవు వెంగెము లాడనేలే
తనివారఁబదివేలు దండాలు వెట్టరాదా॥కూరు॥
  
  
మచ్చికైనదానవు మనసు సోదించనేలే
పచ్చిదేరఁ గూడరాదా పలుమారును
యిచ్చ యెరిఁగినదాన వింపు లడుగనేలే
తచ్చి తచ్చి రతులలో తని వందించరాదా॥కూరు॥
  
  
ఇతవరిదానవు ఇంత సిగ్గు వడనేలే
తతి విడె మియ్యరాదా తత్తరానను
చతురత శ్రీవేంకటేశ్వరుఁడిట్టె నన్నుఁగూడె
కతలుగా నీ వతనిఁగలయఁగరాదా॥కూరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!