Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7142

కొంకు కొసరెల్లాఁ దీరె కొట్టి బతుకనీవే

రాగము: కన్నడగౌళ

కొంకు కొసరెల్లాఁ దీరె కొట్టి బతుకనీవే
జంకెనలకెల్లా లోను సాదించుమనవే॥పల్లవి॥
  
  
ప్రాణమే తనసోమ్మైతే ప్రాయ మేమినేనీనే
ప్రాణేశుఁడట తా నీపాటెఱఁగఁడా
జాణఁడు తనకు నాకు సరికిబేసికి లంకె
ఆణాజ్ఞకు లోను అట్టే సేయుయనచే॥కొంకు॥
  
  
తనువే తనసోమ్మైతే తాప మేమిసేసీనే
తనివిఁబొందించీ నింత తా నెఱఁగడా
తనుప్రేమ నాప్రేమ తారుకాణలకు వచ్చె
చెనకులకెల్లా లోను సేంత సేయుమనవే॥కొంకు॥
  
  
చిత్తమే తనసోమ్మైతే సిగ్గు లేమి సేసీనే
చిత్తజగురుఁడు తా నీచింతెఱఁగఁడా
అత్తి శ్రీవేంకటేశుఁ డాతఁడే నన్నుఁ గూడె
కోత్త చేఁత కెల్లాలోను కోరితి నే ననవే॥కొంకు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!