Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7232

కంటి నీమనసు నేను కడమలేనివాఁడవు

రాగము: ముఖారి

కంటి నీమనసు నేను కడమలేనివాఁడవు
అంటి ముట్టి పెనఁగేవు అలపు లేదెపుడు॥పల్లవి॥
  
  
యెంతయినా మన్నింతువు ఇటు నీకు వలచిన-
కాంతలను మొగమోటఁ గాదనఁబోవు
పంతములైనా నిత్తువు బత్తిసేసినవారికి
చెంతఁ బెండ్లికొడుకవై సిగ్గువడ వెపుడు॥॥
  
  
చెప్పినట్టు సేతువు చెలిమికతైలకును
వుప్పతిల్లు నేస్తమున నోపననవు
కుప్పళింతువు ప్రియము కూటమిగలవారికి
చిప్పిలు మేలువాడవై సిగ్గువడ విపుడు॥॥
  
  
కందువల గూడుదువు కామించినమావంటి
ఇందుముఖుల మేలాన నీడేర్తువు
ఇందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
చెందినతమకముల సిగ్గువడ వెపుడు॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!