Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8651

తక్కిన చదువులొల్ల తప్ప నొల్లా

రాగము: దేసాళం

తక్కిన చదువులొల్ల తప్ప నొల్లా
చక్కఁగ శ్రీహరి నీశరణే చాలు॥పల్లవి॥
  
  
మోపులు మోవఁగనొల్ల ములుగఁగ నేనొల్ల
తీపు నంజనొల్ల చేఁదు దినఁగనొల్ల
పాపపుణ్యాలవి యొల్ల భవమునఁ బుట్టనొల్ల
శ్రీపతినే నిరతము చింతించుటే చాలు॥తక్కి॥
  
  
వడిగాఁ బరువులొల్ల వగిరింపనేనొల్ల
వెడఁగుఁజీఁకటి యొల్ల వెలుఁగూనొల్ల
యిడుమల వేఁడనొల్ల యెక్కువ భోగములొల్ల
తడయక హరి నీదాస్యమే చాలు॥తక్కి॥
  
  
అట్టె పథ్యములొల్ల అవుషధము గొననొల్ల
మట్టులేని మణుఁగొల్ల మైల గానొల్ల
యిట్టె శ్రీవేంకటేశుఁ నిరవుగ సేవించి
చుట్టుకొన్న యానందసుఖమే చాలు॥తక్కి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!