Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8654

తక్కినవారికెల్లాఁ దరితీపు లందురు

రాగము: సాళంగనాట

తక్కినవారికెల్లాఁ దరితీపు లందురు
మిక్కుటపు సరసము మీలో నమరును॥పల్లవి॥
  
  
తగునమ్మ యిన్నిటాను తరుణి నీకాతనికి
నగవమ్మ యాతనితో ననువునను
జిగి మీరొక్కరొకరు సేసినట్టెల్లాఁజెల్లె
మిగులా మీవొద్దికలు మీలో నమరును॥తక్కి॥
  
  
కూడెనమ్మ సంసారము కోమలి మీయిద్దరికి
చూడవమ్మ అతనిపై సొలపుఁజూపు
తోడునీడలవలెను దొరకె మీవయసులు
మేడుపుమీరతులివి మీలో నమరును॥తక్కి॥
  
  
పండెనమ్మ వలపులు పడఁతి మీకొర్కులకు
వుండవమ్మ యీతనివొద్దనే నీవు
అండనే శ్రీవేంకటేశునంకెలే నీయంకెలాయ
మెండగుమీకూటములు మీలో నమరును॥తక్కి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!