Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8676

తగినట్టే మెలఁగితే దైవమైనాఁ గరఁగును

రాగము: పూర్వగౌళ

తగినట్టే మెలఁగితే దైవమైనాఁ గరఁగును
వెగటుగా నడచితే విసిగించు వలపు॥పల్లవి॥
  
చేసినట్టే సేయవయ్య సేయకుమంటే నంత
వేసరుకొందువో ఆండ్లు వేవేలు నీకు
ఆసపడ్డదాన నేను అయినంత మేలే చాలు
వాసులెంచ బోతేను వడిఁబడు వలపు॥॥
  
ఆడినట్టే ఆడవయ్య ఆడకుమంటే నెంత
జాడ తప్పుదువో పెక్కుసతులు నీకు
తోడఁ బెండ్లికూఁతురను దొరకినంతే చాలు
పాడి పంతాలకుఁ బోతే పచ్చిదేరు వలపు॥॥
  
చూచినట్టే చూడవయ్య చూడకుమంటే నెంత
యేచి తమకింతువో నీకింతులు శాన
కాచుక శ్రీవేంకటేశ కైకొని నన్నేలితివి
వాచవి మోవడిగితే వన్నె కెక్కు వలపు॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!