Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8685

తగునయ్య నీకిన్నియు దైవపురాయ

రాగము: సామంతం

తగునయ్య నీకిన్నియు దైవపురాయ
మొగమునఁ గళనిండె మోహనరాయా॥పల్లవి॥
  
  
మీఱుచు మాటలాడి మెలుఁత చెక్కుల వెంట
జాణించితిగా చెమట జాణరాయ
ఆఱడిమాఁటలాడి అట్టె పట్టినీవు
చూఱగొంటివిగా సిగ్గు సుగుణరాయ॥తగు॥
  
  
మంతనాన నవ్వుతానే మర్మములు గరఁగించి
వింతలు సేసితివిగా విటరాయ
అంతలోనే పైకొని అధరపుఁదేనే లిచ్చి
చెంతఁ జొక్కించితివిగా చెలువరాయ॥తగు॥
  
  
పులకలు పెడరేఁచి పొందులెల్లాఁ జేసి యీకెఁ
జెలరేఁగించితివిగా సింగారరాయ
బలురతుల నోలార్చిపలుమారు మన్నించి
చిలికితివిగా మేలు శ్రీవేంకటరాయా॥తగు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!