Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8700

తగుఁ దగు నీకు నాకుఁ దలవయ్యా

రాగము: శ్రీరాగం

తగుఁ దగు నీకు నాకుఁ దలవయ్యా
తగవు లగవులాయఁ దమకించకువే॥పల్లవి॥
  
  
మొఱఁగి కన్నుల నీకు మొక్కేమయ్యా వో
తెఱవ నేఁ గన్నులనె దీవించితినే
వెఱగంది మోవి నీకు విందు చెప్పేఁ బో నిన్ను
జఱసి నే గుక్కిళ్లఁ జివిగొంటిఁ బో॥తగు॥
  
  
పెలుచు నా కోరికలఁ బిలిచేనయ్యా నేనుఁ
బలుమారు నాలోనె పలికితినే
మెలఁగి ని న్నొకవేల మెచ్చేనయ్యా
నలువంక సెలవుల నవ్వితి నేను॥తగు॥
  
  
పెంపుడుఁగుచాల నిన్నుఁ బెద్దసేసేఁ బోనే
నింపుల రతుల ని న్నెచ్చరించేనే
గుంపెన శ్రీ వెంకటేశ కూడితిమయ్యా నిన్ను
దింపక నా వురమున దిష్టము మోచితివే॥తగు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!