Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8710

తడఁబడె నా మది తన కౌనో నా కౌనో

రాగము: కురంజి

తడఁబడె నా మది తన కౌనో నా కౌనో
చిడిముడి నాతనికిఁ జెప్పరే యీ కతలు॥పల్లవి॥
  
పెనగొని మాటలాడఁ బెదవులు వేగిరించీ
తన చిత్త మెట్టున్నదో తలఁచరాదు
కనుఁగొనలఁ దనుఁ జక్కఁగఁ జూడకుండరాదు
వొనర నెంత నాఁటునో వోరువరాదు॥॥
  
కాయము తోడి లంకెలు కరములఁ దొట్టు కొనీ
ఆ యెడ నెం తలసునో అదియుఁగాదు
పాయపు మదము గుబ్బలు తన పొందు గోరీ
ఆయము లేడ సోఁకునో అంత కోప రాదు॥॥
  
జవ్వనానఁ గల సిగ్గు సమరతు లాసపడీ
నవ్వు లెట్టున్నవో నాతోఁ దనకు
యివ్వల శ్రీ వేంకటేశుఁడేలె నన్ను మెచ్చితే
రవ్వ లెంతౌనో యీరతి చెప్పరాదూ॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!