Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8717

తతిఁ దానె దొరయైతే తనంత బదుకుఁ గాక

రాగము: రామక్రియ

తతిఁ దానె దొరయైతే తనంత బదుకుఁ గాక
సతులము మమ్మునేల జంకించీనే తాను॥పల్లవి॥
  
  
పాయపువిభుఁడు కొంగు వట్టితే రానై తినంటా
చాయల సన్నలఁ దిట్టీ సారెసారెకు
మాయంతనే అప్పటిని మాటలాడ మైతిమంటా
రాయడించీ నూరకైనా రాజసమా తాను॥తతి॥
  
  
ననిచి తా దగ్గరితే నవ్వనైతి నంటాను
కనుఁగొనల గోపించీఁ గడకూఁ దాను
మునుపనే తనకు నే మొక్కనైతి నంటాను
యెనలేక పగ చాటీ నేతులా తాను॥తతి॥
  
  
చెక్కు నొక్కి కూడఁగాను సిగ్గుతో నే నుంటినంటా
మిక్కిలి బుజ్జగించీని మీఁద మీఁదను
యిక్కడ శ్రీవేంకటేశుఁ డిచ్చెరిఁగి నన్నుఁ గూడె
దక్కితి నంటాఁ బొగడీ తగవా తాను॥తతి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!