Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8719

తత్తరించనేటికి తరుణి మనసెఱిఁగి

రాగము: కన్నడగౌళ

తత్తరించనేటికి తరుణి మనసెఱిఁగి
హత్తి మరిగించుకొని యాదరించుటగాక॥పల్లవి॥
  
  
సిగ్గుతోడ జవరాలు శిరసువంచుకుండఁగ
దిగ్గనఁ గొప్పువట్టితియ్యవచ్చేవు
వెగ్గళించి నిన్నేమైనా వేగిరించి పలికెనా
వొగ్గి నీచేతికిలోనై వుండీఁగాక॥తత్త॥
  
  
కొత్తగాఁగాఁ జెలిమాటుకొని నిలుచుండఁగాను
బత్తితోఁ గప్పురమేల పైఁజల్లేవు
వొత్తి నీవు చెనకఁగా వొవనని జంకించీనా
యిత్తల నీచేఁతలకు నియ్యకొనీఁగాక॥తత్త॥
  
  
అలమేలుమంగ వొయ్యారాన నుండఁగాను
కలసి యప్పటి నెంతకాఁగిలించేవు
యెలమి శ్రీవేంకటేశ యిఁక నిన్ను మఱచీనా
మెలగి నీరతులెల్లా మెచ్చీఁగాక॥తత్త॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!