Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8754

తనకోరిక లేఁటికి నాతఁడె యిన్నియుఁ గల్పించఁగ

రాగము: బౌళి

తనకోరిక లేఁటికి నాతఁడె యిన్నియుఁ గల్పించఁగ
అనువుగ నిందుకు యిద్దరి యత్నంబులు వలెనా॥పల్లవి॥
  
  
అద్దముచూచెటియాతఁ డలరుచు నవ్విన నవ్వును
అద్దములోపలినీడయు నారీతినె కాదా
గద్దరియగు శ్రీవిభుసంకల్పంబుననె జగముల
సుద్దులు దుఃఖము సుఖమును సూటిఁబఁడె గానా॥తన॥
  
  
నాఁటక మాడించునతఁడు నయమునఁ గదలింపంగా
నాఁటక మందలిబొమ్మలు నానాగతిఁ జెలఁగున్
ఆటలఁ జేతన్యాత్మకుఁడగు దేవుని చేష్టలనె
పాటిగఁ బాపముఁ బుణ్యము బహుళం బగుఁగానా॥తన॥
  
  
అరదము నడపెటిసారథి యటునిటు వాగెటు వట్టిన
అరదముగుఱ్ఱములు మెలఁగు నాయాముఖములను
నరులను శ్రీవెంకటగిరినాథుఁడె తగ బ్రేరింపఁగ
గరవము లేమియుఁ గలిమియుఁ గలిగుండుఁ గానా॥తన॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!