Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8774

తన పా టెంచుకోఁడు దైవమా యీ యాతుమ గాచి

రాగము: రామక్రియ

తన పా టెంచుకోఁడు దైవమా యీ యాతుమ గాచి
ఘనవివేకం బొసఁగి కాణాచిగా నేలఁ గదే॥పల్లవి॥
  
  
బలుకాంక్షలు ముందల పట్టి తియ్యఁగా దుఃఖించఁడు
తొలఁగ క్రోధము రొమ్ముఁ చోక్కఁగా దుఃఖించుఁడు
బలిమితో లోభము తన్ను బాధించఁగా దుఃఖించఁడు
వలవంత దేహి చన్నవారికి దుఃఖించును॥తనపా॥
  
  
తను నీషణత్రయము దండించఁగా దుఃఖించఁడు
మన సేడకైనాఁ బోయి మరుగఁగా దుఃఖించఁడు
ఘనమోహాంధకారము కలఁచఁగా దుఃఖించఁడు
మును చన్నవారికిఁగా మొనసి దుఃఖించును॥తనపా॥
  
  
పట్టి జవ్వనమదము పఱచఁగా దుఃఖించఁడు
అట్టే తాను జన్మించినయందుకు దుఃఖించడు
నెట్టన శ్రీవేంకటేశ నీ బంటుఁగాఁ జేసుకొని
గట్టిగా దుఃఖ ముడిపితే కాచుకొని సుఖించును॥తనపా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!