Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8780

తన మేలె చూచుఁగాక తరుణుల యెడలను

రాగము: లలిత

తన మేలె చూచుఁగాక తరుణుల యెడలను
యెనలేని మగవాని నే మనఁగవచ్చును॥పల్లవి॥
  
  
మంతనాన నాకె నీవు మాటలాడేచోటికి
వింతది రా సిగ్గుగాదా విచారించితే
చెంత నీ వి దెరఁగక చెలి నిందుకుఁ బిల్చేవు
యెంతై నా మగవాని కెక్కడిది తగవు॥తన॥
  
  
గారవాన నాకె నీవు కాఁగిలించుకుండఁ గాను
మారుసతి తోఁగి చూడ గోరము గాదా
ఆరీతి వాకిటనుంటే ఆపెఁ దెమ్మనేవు వీడె-
మారజపుమగవాఁడు ఆడికెకు లోఁగునా॥తన॥
  
  
శ్రీ వేంకటేశుఁడ ఆకె చెయివట్టి పెండ్లాడఁగా
సేవ సేయ నొకతెకు సెగ్గెము గాదా
యీవల న న్నేలితివి యీపెఁ నాపె గూడితివి
కావరపుమగవాని కత లిట్టే కాదా॥తన॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!