Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8798

తనివారఁ దిరువ నందలముసేవ నేఁడు

రాగము: శంకరాభరణం

తనివారఁ దిరువ నందలముసేవ నేఁడు
అనువుగా సేవించరో అమరులు ఋషులు॥పల్లవి॥
  
  
యెదురుగాఁ గూచుండి యిద్దరు నందల మెక్కి
కదిసి మీఁదఁ బన్నాగము గట్టించి
ముదమున నొండొరులు మోములు చూచుకొంటా
యిదివో దేవులు దేవుఁ డేఁగేరు వీధులా॥తని॥
  
  
చదురులమాఁటలు సతు లాడఁగా వింటా
వుదుటునఁ దమ యంగా లొరయఁగను
అద నెరిఁగి మోవుల నంతలో నవ్వులు నవ్వి
యెదు రెదుర దంపతు లేఁగేరు వీధులా॥తని॥
  
  
పొదిగి యలమేల్మంగ పూఁచి కాఁగిలించఁగాను
కదలక కూడీ శ్రీవెంకటేశ్వరుఁడు
అదివో యాతఁడు మెచ్చె నాతని నాపె మెచ్చె
యెదిగి నగరిలోనె యేఁగేరు వీధులా॥తని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!