Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8834

తన్నుఁ బాసి నేనింత దంటనట యీ

రాగము: మంగళకౌశిక

తన్నుఁ బాసి నేనింత దంటనట యీ
వెన్నెలబాయిట రేయి వేగుఁటింత చాలదా॥పల్లవి॥
  
  
ఇంటికి రాకుమని నేనంటినట చూడవే
అంటఁగాక వున్న దాన నంటినో యేమో
కంటికి నిద్దురరాక కాఁకలనే పొద్దువోక
వొంటి నేఁ బానుపున రేయుంటి నింత చాలదా॥తన్ను॥
  
  
అప్పటి దగ్గరి నే రానై తినట చూడవే
కొప్పు జారి సిగ్గుతోడఁ గొంకితి నేమో
చిప్పల రెప్పల జంకించితినట చూడవే
చెప్పరాని మాట నీతో జెప్పుటింత చాలదా॥తన్ను॥
  
  
ఊరకే మాటాడక నే నుంటినట చూడవే
ఆరడి పరవశాన నైతినో యేమో
గోరికొనఁ దనుఁ దక్క గొంటినట చూడవే
యేర వేంకటేశ నాతోనింత నీకుఁ జాలదా॥తన్ను॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!