Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8926

తఱవాతి మాట లెల్లా దయ్య మెఱుఁగు

రాగము: కాంబోది

తఱవాతి మాట లెల్లా దయ్య మెఱుఁగు
యెఱుఁగనిదానఁ గాను యేమందు నేను॥పల్లవి॥
  
  
మంతనము లాడుకొంటా మంచముపై గేరుకొంటా
యింతదడవు నుండరా యిద్దరు మీరు
అంతలో నే రా గానుఁఆపెఁ జూప యెవ్వ తెంటా
యెంత కెంత న న్నడిగే వేమందు నేను॥తఱ॥
  
  
అంగము లురసుకొంటా నాయములు ముట్టుకొంటా
యెంగిలిపోత్తందుకోరా యిద్దరు మీరు
సంగడి నేఁ గూచుండఁగా సతి నా చెలి యనుచు
యింగితానఁ బే రడిగే వేమందు నేను॥తఱ॥
  
  
కమ్మి కౌఁగిలించుకొంటా కాయము లుబ్బించుకొంటా
యిమ్ములఁ గూడి యుండరా యిద్దరు మీరు
పమ్మి నే దగ్గరఁ గాను పైకొని కూడితి విట్టె
యెమ్మెల శ్రీవేంకటేశ యేమందు నేను॥తఱ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!