Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8953

తల వంచుకొననేల దండవే వున్నాఁ డాతఁడు

రాగము: వరాళి

తల వంచుకొననేల దండవే వున్నాఁ డాతఁడు
చెలఁగి నోరార నీవే సేయవే విన్నపాలు॥పల్లవి॥
  
  
తలపోఁ త లెక్కుడైతే తాలిమి గలుగునా
చలము సాదించఁ బోతే సరసమౌనా
సొలపులే తరచైతే సొగయునా నేస్తాలు
పిలిచి మాటాడఁగదే ప్రియునితో నీవు॥॥
  
  
వట్టిగుట్టున నుంటేను వాడిక లొనగూడునా
దిట్టతనమే పెంచితేఁ బుట్టునా దయ
నెట్టుకొన్న సిగ్గులైతే నిలుచునా మచ్చికలు
చుట్టరికము లెల్లాను చూపవే మగనికి॥॥
  
  
పంతములె నెరపితే భావములు గరఁగునా
వంతువాసు లెంచితేనే వలపంటునా
వింతగా నలమేల్మంగ విభుఁడు శ్రీవేంకటేశుఁ -
డింతలో నిన్నేలె మెచ్చి ఇచ్చకములాడవే॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!