Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8974

తలఁచుకొమ్మనవె తానే నా గుణములు

రాగము: పాడి

తలఁచుకొమ్మనవె తానే నా గుణములు
వెలినేల లోనికిట్టే విచ్చేయు మనవే॥పల్లవి॥
  
సముకానఁ దానిచ్చిన చనవులోదానఁ గాని
తమకించే కక్కసపుదానఁ గాను
రమణిపై వినోదాన రాసికెక్కేదానఁ గాని
అమరని వొడ్డారములాడేదానఁ గాను॥తలఁచు॥
  
ననుపుతోఁ దానవ్వే నవ్వులలోదానఁగాని
తను నలయించే మంకుదానఁ గాను
వొనరి వుండ నేర్చిన వూడిగపుదానఁ గాని
పెనఁగి పెనఁగి సడిఁబెట్టేదానఁ గాను॥తలఁచు॥
  
కలసి యిటులనుండే కాఁగిటిలోదానఁ గాని
తలుపుమాటున నుండేదానఁ గాను
యెలమి శ్రీవేంకటేశుఁడేలె నన్ను నింతలోనే
కలిమిలోదానఁ గాని కడదానఁ గాను॥తలఁచు॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!