Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8982

తలఁచుకో వో మనస తగిన ద్రిష్టము లివి

రాగము: సౌరాష్ట్రం

తలఁచుకో వో మనస తగిన ద్రిష్టము లివి
వెలలేక తెచ్చేటి వివేకము లోధనము॥పల్లవి॥
  
  
గాలిఁబోయేఁ మాటలు లోకములోని సుద్దులెల్లా
గాలిఁ బో వెన్నఁడును శ్రీకాంతునుతులు
జాలిఁబడే సేఁతలుసంసారభోగములెల్లా
జాలిలేని‌వి విష్ణుని సంతతపుపూజలు॥తలఁ॥
  
  
మాయమౌ గొన్నాళ్లకు మానుషకృత్యములెల్లా
మాయముగానివి దైవికమహిమలెల్లా
కాయకములే తమ కల్పితము లన్నియును
కాయకము గాక నిల్చుఁ గమలాక్షు మన్నన॥తలఁ॥
  
  
వుడివోవు రాఁగారాఁగా నున్నతకర్మఫలాలు
వుడివోదు దేవునిపై నొనరు భక్తి
జడియ నితరులిచ్చేసకల వరములును
జడియదు శ్రీవేంకటేశ్వరుఁడిచ్చే వరము॥తలఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!