Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8990

తలఁపులో కొట్టగొన దైవమే వున్నాఁడు

రాగము: గుండక్రియ

తలఁపులో కొట్టగొన దైవమే వున్నాఁడు
తలఁచిన రూపులెల్లా తా నయ్యీనయ్యా॥పల్లవి॥
  
  
కలలో ప్రపంచము కంటి నే నొకటి
వెలినున్న ప్రపంచవిధివలెనే
కలనున్నవాఁడ నేనే వెలి నన్నువాఁడ నేనే
తెలి(య?) మాబతుకు రెంట దెప్పరములయ్యా॥తలఁ॥
  
  
దేహమీఁడ నుండఁగానే దిక్కులకేఁగీ మనసు
దేహముతో దిక్కులెల్లాఁ దిరిగినట్టే
దేహములోవాఁడ నేనే దేహముపై వాఁడ నేనే
వోహో మాజన్మములో నొకటి రెండయ్యా॥తలఁ॥
  
  
కన్నులెదుట శ్రీవేంకటపతిఁ గొలిచెద
కన్నుమూసి యాతనినే కమ్మర భావించెదను
కన్నులోపల నేనే కన్నులవెలిని నేనే
వున్నతి నీరెండును వొక్కటాయనయ్యా॥తలఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!