Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -8991

తలఁపులో కోరికలు దైవారీని

రాగము: ఆహిరి

తలఁపులో కోరికలు దైవారీని
యెలమిఁ గానుక లిచ్చి యీడకు రమ్మనవే॥పల్లవి॥
  
  
చెప్పరే యాతనిరాక చెలులాల
వుప్పతిల్లుఁ గాఁకలకు నోపనే నేను
కుప్పలుఁ దెప్పలునాయ కోరికలు
ఇప్పుడు కొలువులోఁ దా నేమిసేసినే॥॥
  
  
చూపరే తనిమోము సుదతులాల
పైపై నాతమకము పట్టఁ గరాదు
మోపాయ జవ్వనము మొగి నామేన
యేపునఁ దనకు నన్ను నీడెర్చఁ దగును॥॥
  
  
పొందుసేయరే యాతనిఁ బొలఁతులాల
విందువలెఁ దానె శ్రీవేంకటేశుఁడు
యిందుకే వచ్చి కలసె నిదివో నన్ను
అందమైన యిల్లాల నే నలమేలుమంగను॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!