Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9012

తానిచ్చిన చనవునఁ దడబడేవారము

రాగము: దేవగాంధారి

తానిచ్చిన చనవునఁ దడబడేవారము
మోనముతోడుత నిట్టె మొక్కితి నేననవే॥పల్లవి॥
  
  
మగువలపంతములు మగవానిచేతివి
పగటునఁ జెల్లఁ బెట్టి పాలార్చను
మగడి తనతో మారుమాఁట లాడేవారమా
తగువు లెల్లాఁదానే తలఁచు కొమ్మనవే॥తాని॥
  
  
చెలులమందెమేళాలు చేపట్టినవాని కింపు
పలుదెరఁగుల మెచ్చి పాలార్చను
బలిమి సేసినతన్నుఁబచారించేవార మా
నిలిచినతనవోజ నేరపుట గాక॥తాని॥
  
  
నావలపు శ్రీవేంకటనాయకుఁడు
భావించి నన్ను నేలి పాలించను
యీవేళఁ దా నన్నుఁ గూడె నిది గాదనేవారమా
వేవేలకుఁ దానే జాణ వినుతించే నిఁకను॥తాని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!