Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9018

తాను సేసిన పనులు దక్కవలెనంటాను

రాగము: వరాళి

తాను సేసిన పనులు దక్కవలెనంటాను
నానఁబెట్టుక లోలోనే నవ్వులు నవ్వీనే॥పల్లవి॥
  
  
తగవులు చెప్పరాదు తనను నేమీ ననరాను
మగువ సవతిగాఁగా మాటాడితినే
అగడు సేసితినంటా అదె నెపము సేసుక
పగటున పానుపుపై పవ్వళించియున్నాఁడే॥తాను॥
  
  
వలపులు రేఁచరాను వాడులు వెట్టుకోరాను
చెలికత్తెగాఁగా నటు చెనకితినే
చలము సాదించెనంటా సాకిరు లందరిఁబెట్టి
వెలయఁగ దోమతెర వేసుకవున్నాఁడే॥తాను॥
  
  
కల్లమోపరాను తన్ను కరకరంచరా నాకె
చెల్లెలుగాఁగాఁ బెండ్లి సేసితినే
ఇల్లిదె శ్రీవేంకటేశుఁ డేలె నన్ను మీరెనంటా
పల్లదానఁ గాఁగిలించి పాయకున్నాఁడే॥తాను॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!