Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9023

తా నెట్ల నున్నాఁడో తరుణి వినిపించవే

రాగము: శంకరాభరణం

తా నెట్ల నున్నాఁడో తరుణి వినిపించవే
కానక నినుఁ గన్న నతనిఁ గన్నట్ల నాయనే॥పల్లవి॥
  
  
కొంతవడిఁ దనుపేరు కోరి నాలుకఁ దలఁతునే
కొంతవడి దనసుద్దులు కొమ్మలచే బిందునే
కొంతవడి తానున్న కొలువుచిత్తరువు చూతు
కాంతయీరీతిఁ బొద్దు గడపుదునే నేను॥తానె॥
  
  
మది నొక్క వేళఁ దనమాట దలపోతునే
కదిసి యొకవేళ దన్నుఁ గలలోనఁ గందునే
పదములనె వొకవేళ యెదురు నడతు నేఁ దనకు
తుద నిట్ల దినదినము దొబ్బుదునే నేనూ॥తానె॥
  
  
సగినములు చూచుచు నే జరపుదునే వొకగడియ
వగలఁ దను దూరి లేకలు వ్రాతుఁ గొంతదడవు
జిగి నింతలోఁ గూడె శ్రీవెంకటేశ్వరుఁడు
మగిడి యల్లాడ నపుడు మలఁగుపయి నిపుడూ॥తానె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!