Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9031

తా నెరఁగఁడా యీతగవు లెల్లెడలను

రాగము: దేవగాంధారి

తా నెరఁగఁడా యీతగవు లెల్లెడలను
నేనేమైనా తనమీఁద నెపాలు వేసేనా॥పల్లవి॥
  
  
రతివేళమాఁటలు రచ్చలకు నెక్కవు
యితవైనవారికి యెగ్గులేదు
పతికిని సతికిని పాయదు చుట్టరికము
అతిమోహములకును అడ్డాఁకలేదు॥తానె॥
  
  
సిగ్గువడ్డయంతలోనే చేరదు తమకము
వెగ్గళించినా నవ్వులు వేసటగావు
వొగ్గి వేఁడుకొంటేనే వోదు గదు బీరము
కగ్గనిపొందులలోన కపటము లుండవు॥తానె॥
  
  
చనవరిచేఁతలు సాదింపులు గావు
యెనసినకూటమికి నెర వేడది
ఘనశ్రీవేంకటేశుఁడు కదిసె నన్నింతలొనె
వినయముగలచోట వెగటై తోఁచదు॥తానె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!