Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9050

తా నేడ నే నేడ తడవి నన్ను

రాగము: సామంతం

తా నేడ నే నేడ తడవి నన్ను
నానఁబెట్టి వట్టిమాట నయగారి గదవే॥పల్లవి॥
  
  
వచ్చి వచ్చి చూచేది వలపు మోచేది
బచ్చనల సటకాఁడు పాయఁడే నన్ను
కొచ్చి నడుము దూరేది గోరనే గీరేది
నిచ్చలు మానఁడు వీఁడు నేరుపరి గదవే॥తానేడ॥
  
  
ఆసలనే పొనిఁగేది ఆచ్చలాన మునిఁగే ది
వాసులకు వెంట వెంట వచ్చీనే తాను
బాస లెల్ల నెరుపేది పను లెల్లా మరిపేది
కాసీఁ గూరిమియెండ కడు జాణ గదవే॥తానేడ॥
  
  
కడు సిగ్గు విడిచేది కలికియై నడచేది
నడుమంత్రమున వీఁడు నవ్వీనే నన్ను
యెడలేక శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
అడియాలా లెల్ల నిచ్చె నందగాఁడు గదవే॥తానేడ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!