Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9056

తానే తానే యిందరి గురుఁడు

రాగము: సామంతం

తానే తానే యిందరి గురుఁడు
సానఁబట్టిన భోగి జ్ఞానయోగి॥పల్లవి॥
  
  
అపరిమితములైన యజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ధి పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మ యోగి॥తానె॥
  
  
అన్ని చేఁతలును బ్రహ్మార్పణవిధిఁ జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరఁగఁ గరుణించ
పన్నగ శయనుఁడే బ్రహ్మ యోగి॥తానె॥
  
  
తనరఁగఁ గపిలుఁడై దత్తాత్రేయుఁడై
ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయఁడై
వొనరఁగ సంసారయోగము గృపసేయు
అనిమిషగతుల నభ్యాస యోగి॥తానె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!