Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9069

తానే యెఱుఁగుగాక తఱవాతి పనులు

రాగము: ఆహిరి

తానే యెఱుఁగుగాక తఱవాతి పనులు
పూనిపట్టి తనునెట్టు బోదించవచ్చునే॥పల్లవి॥
  
  
పట్టరానిది వయసు పంచరానిది వలపు
కట్టిపెట్టరానివి కనుచూపులు
మెట్టరానిది మనసు మీరరానివి వాసులు
యెట్టుసేసినా విభుని నేమని సొలతునే॥తానే॥
  
  
చెప్పఁగరానిది సిగ్గు సేయరానిది నగవు
కప్పి పెట్టరానివి చక్కఁదనములు
తిప్పరానిది గుణము తెంచరానిది కోరికె
అప్పటి నీతనిం గాధన నెట్టువచ్చునే॥తానే॥
  
  
తనియరానిది రతి దాఁటరానిది పొందు
మొనసి మానరానిది మొగమోటము
యెనసె శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
చనవిచ్చెఁ దను నెట్టు సాదించవచ్చునే॥తానే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!