Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9081

తా నేల నిలుచున్నాఁడు తడవుల నుండీని

రాగము: సామంతం

తా నేల నిలుచున్నాఁడు తడవుల నుండీని
పానిపట్టి చెలులాల పద మనరే॥పల్లవి॥
  
  
మనసు రాని తలఁపు మాటలోనె కాన వచ్చు
పెనఁగి యప్పటి వీఁడు పిలిచీఁ గొంతా
ననుపు గల దెల్లాను నవ్వినందే తెలిసితి
పని గద్దు వచ్చేఁ గాని పద మనరే॥తా నేల॥
  
  
నెరమెచ్చువలపులు నిలిచినందే తోచె
సరసాన వీఁడె చేయి చాఁచీఁ గొంతా
కరుణ గల దెల్లాను కనుచూపులనె కంటి
పరిణామ మాయ నాకుఁ బద మనరే॥తానేల॥
  
  
కలిగిన తమకము కాఁగిటిలోఁ గానవచ్చె
అలరి తాఁ బెట్టుకొనీ ఆనలూఁ గొంతా
వెల లేని వేడుక శ్రీవెంకటేశుఁ డిటు గూడె
పలుకు లేఁటికి నిఁకఁ బద మనరే॥తానేల॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!