Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9085

తా నేల వసివాడీ దగ్గర రమ్మనవే

రాగము: భైరవి

తా నేల వసివాడీ దగ్గర రమ్మనవే
నేనే వెజ్జరికము నేరుతు నందుకునూ॥పల్లవి॥
  
యెదిరి వారి చూపులు యెంత దన్ను నాఁటెనో
మదన వేద మంత్రాల మంత్రింతునటే
కదియఁ గాఁ జన్నులు కాయ మెంత వొత్తునో
గుదిగొనఁ గాంతు నటే గోరి వెచ్చ కౌఁగిటా॥॥
  
చెనకే వారి చేఁతల చిత్త మెంత మఱచెనో
మొన గోరి సంజీవి మోపుదు నటే
పెనఁగఁగా మర్మాలు ప్రేమ నెంత గరఁగెనో
తనిపి పేరింతునటే తరితీపు సిగ్గులా॥॥
  
మందవారి మాటలు మరులు గొలిపెనో
దిందుపడ వలపు ల మందిత్తునటే
అందపు శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగను నేను
చెందె నన్ను నిఁక నిట్టే సేతు నటే సేవలూ॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!