Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9116

తామొకరి నాడుదురు తమనేరా లెంచుకోరు

రాగము: బౌళి

తామొకరి నాడుదురు తమనేరా లెంచుకోరు
భూమిలో నిట్లఁ గాఁగానే పో కౌను సమసె॥పల్లవి॥
  
  
కాదనేటిదాననా కడు నీవు నవ్వితేను
సోదించి నీమోవి నీవే చూచుకోరాదా
యీదె నీభావ మయ్యా యెదుటిచందురుకందు
నాదించేకన్నులు తననలుపు లెంచీనా॥తాము॥
  
  
వేసరేటిదాననా వెంగేలు నీ వాడితేను
యీసు నీగుణము నీవే యెంచుకోరాదా
మోసాన జలనిధిని మునినోరియెంగిలనే -
వూసివాసినోరు తనవొద్దియెంగి లెంచీనా॥తాము॥
  
  
వంతుకెంచేదాననా వచ్చి నీవు గూడఁగాను
ఇంతలో నావరుస నీవెంచుకోరాదా
పంతపు శ్రీవేంకటేశ పైకొని కూడితి నన్ను
దొంతి తన నీడ తోడువాసి వుండునా॥తాము॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!