Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9134

తిట్టితే నేమిసేతువు దేవరవైనా నైతివి

రాగము: నాట

తిట్టితే నేమిసేతువు దేవరవైనా నైతివి
గట్టువాయతనమునఁ గాలుదొక్కేవు॥పల్లవి॥
  
  
చయ్యనఁ బరాకుమీఁద సకులతో మాటాడఁగా
పయ్యదకొంగు వట్టి భ్రమయించేవు
వూయ్యాలమంచముపై వూరకే వినోదించఁగ
గయ్యాళితనాన వచ్చి కాఁగిలించేవు॥తిట్టి॥
  
  
వెలయఁగఁ గొనగోళ్ళ వీణె వాఇంచఁగాను
మలసి యదరిపు మర్మమంటేవు
పొలుపుమిగుల నేను పువ్వులు ముడుచుకోఁగా
కెలపుఁజేతల నేమి గిలిగించేవు॥తిట్టి॥
  
  
ఇదివో ముచ్చటతో నే నేకతాన నుండఁగాను
కదిసి రతుల గూడి కరఁగించేవు
అదన శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
చెదరక మొక్కఁగాను చెక్కునొక్కేవు॥తిట్టి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!