Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9142

తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ

రాగము: దేసాళం

తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ
సురతవిన్నాణరాయ సుగుణకోనేటిరాయ॥పల్లవి॥
  
  
సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరస వైభవరాయ సకలవినోదరాయ
వర వసంతములరాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ॥తిరు॥
  
  
గొల్లెతల వుద్దండరాయ గోపాలకృష్ణరాయ
చల్లు వెదజాణరాయ చల్లఁ బరిమళరాయ
చెల్లుబడి దర్మరాయ చెప్పరాని వలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ॥తిరు॥
  
  
సామసంగీతరాయ సర్వమోహనరాయ
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ
కామించి నిన్నుఁ గోరితే గరుణించితివి నన్ను
శ్రీమంతుఁడ నీకు జయ శ్రీవేంకటరాయ॥తిరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!