Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9144

తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట

రాగము: సాళంగనాట

తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట
హరి వాఁడె పెండ్లికొడుకై ప్రతాపమున॥పల్లవి॥
  
  
కనకపుఁ గొండ వంటి ఘనమైన రథముపై
దనుజమర్దనుఁడెక్కె దరుణులతో
వినువీధిఁ బడెగె(డగ?)లు వేవేలు కుచ్చులతోడఁ
బెనగొనఁగఁ గదలె భేరులు మ్రోయఁగను॥తిరు॥
  
  
వరుసఁ జంద్రసూర్యులవంటి బండికండ్లతోడ
గరుడధ్వజుఁ డొరసిఁ గడుదిక్కులు
పరగు వేదరాసులే పగ్గాలు వట్టితియ్యఁగ
సరుగ దుష్టులఁ గొట్టి జయము చేకొనెను॥తిరు॥
  
  
ఆటలుఁ బాటలు వింటా నలమేల్మంగయుఁ దాను
యీటున శ్రీవేంకటేశుఁ డెదురులేక
వాటపు సింగారముతో వాకిటవచ్చి నిలిచీ
కోటానఁగోటి వరాలు కొమ్మని ఇచ్చుచును॥తిరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!