Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9145

తిరొ తిరొ జవరాల తిత్తి తిత్తి యీ

రాగము: నాట

తిరొ తిరొ జవరాల తిత్తి తిత్తి యీ
తరలమైన నీత(తా?)రహార మదురే॥పల్లవి॥
  
  
ధిమి ధిమ్కి తోంగ తోంగ దిద్ధిమిక్కి ఆరే
మమారే పాత్రరావు మజ్జా మజ్జా
కమలనాభుని తమకపుటింతి! నీకు
నమరెఁదీరుపు ఇదే అవధరించఁగదో॥తిరొ॥
  
  
ఝకజక్క జంఝం ఝణణకిణాని
ప్రకటపు మురువొప్పె భళాభళా
సకలపతికి సరసపుగొమ్మా నీ
మొకసిరి మెరసె చిమ్ముల మురిపెములా॥తిరొ॥
  
  
మాయిమాయి యలమేలుమంగ నాచ్చారి మతిఁ
బాయని వేంకటపతి పట్టపురాణి
మ్రోయఁ జిరుగజ్జెలా నీ మ్రోత లానేని
సోయగమైన నీ సొలపుం జూ పమరే॥తిరొ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!