Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9149

తీరుచవయ్య తగవు దీనికి నీవు

రాగము: వరాళి

తీరుచవయ్య తగవు దీనికి నీవు
నేరుపరితనమెల్లా నీచేత నున్నది॥పల్లవి॥
  
  
పందేలువేసి నీతోఁ బలుమారు జూజమాడి
దిందుపడ నుంగరము దీసుకొన్నది
అందుకుఁగా వేరొకతె అది దనసొమ్మనుచు
అంది తలపిడివట్టి అడుగుతానున్నది॥తీరు॥
  
  
సరి బేసి వట్టి యొక్కసతి నిన్ను నోడించి
గొరబుగా నచ్చుటాసె కోకకొంగున
సిరుల నీదట్టి తనచీరంటా వేరొకతె
అరసి పట్టి యందుకు నాపె మారుకొనెను॥తీరు॥
  
  
వానగుంటలాడి వొకవనిత నీచేయి వట్టి
ఆనవెట్టి వేలొకతె ఆచేయిఁ బట్టె
ఆనుక శ్రీవేంకటేశ అలమేల్ మంగ నే వచ్చి
మేనంతి వురమెక్కితే మెచ్చిరి యిందరును॥తీరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!