Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9174

తెలిపించుకో నీవె దిక్కులమాఁటా

రాగము: నాదరామక్రియ

తెలిపించుకో నీవె దిక్కులమాఁటా
పలుకకు మాతో నీవు పైపై మాఁటా॥పల్లవి॥
  
  
చెంగలిచూపులవొకచెలి నిన్నుఁజూచెనట
అంగడివీది రాఁగా నీ కదొకవఁటా
ముంగిటినుండి యొకతె ముంచి నీతో నవ్వెనట
యింతాగిన మోఁచె నీపై నిదొకమాఁటా॥తెలి॥
  
  
మగువ యొకతె నిన్ను మాఁటా మోవ నాడె నట
అగడు సేసేరు నిన్ను నదొకమాఁటా
తగిలి యెకతె నీకుఁ దమ్ముల మొసఁగె నట
యెగసక్కెము లాయ నిదొకమాఁటా॥తెలి॥
  
  
గక్కన నొకతె నిన్నుఁగాఁగిలించుకొనెనట
అక్కడనే మెచ్చేరు నిన్నదొకమాఁటా
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
యెక్కువల కెక్కుడాయ నిదొకమాఁటా॥తెలి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!