Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9177

తెలియ దెవ్వరికిని దేవదేవేశ యీ

రాగము: శ్రీరాగం

తెలియ దెవ్వరికిని దేవదేవేశ యీ
నెలఁత భావం బెల్ల నీవెఱుఁగు దిఁకనూ॥పల్లవి॥
  
  
నిలుచుఁ దలయూఁచుఁ గన్నీరు వాలిక గోళ్లఁ
జినుకు నివ్వెఱఁగుపడుఁ జింతించును
పులకించు నలయుఁ దలపోయు నినుఁ జిత్తమున
నిలువునంగన విధము నీ వెఱుఁగు దిఁకను॥తెలియ॥
  
  
కమలంబు చెక్కుతోఁ గదియించు నెన్నుదుట
చెమటఁ బయ్యెదఁ దుడుచు సెలవినగును
తమకంపుఁగోరికలు తరుణి యిదె నినుఁబాసి
నిమిష మోర్వఁగలేదు నీ వెఱుఁగు దిఁకను॥తెలియ॥
  
  
వెక్కసపు నునుదురుము వెడవదల నేరదు
చిక్కుదేరఁగఁ గొంతసిగ్గు వడును
ఇక్కువలఁ దిరువేంకటేశ నినుఁ గూడె నిదె
నిక్కమీ చెలివగల నీవెఱుఁగు దిఁకనూ॥తెలియ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!