Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9203

తెలిసినవారికి తెరు విది మరి లేదు

రాగము: బౌళి

తెలిసినవారికి తెరు విది మరి లేదు
నలినాక్షుఁ బొగడెడి నామములో నున్నది॥పల్లవి॥
  
  
ఆకసాన లేదు మోక్ష మటు పాతాళమున లే
దీకడ భూలోకమందు యెందు లేదు
పైకొని ఆసలెల్ల పారఁదోలి వెదకితే
శ్రీకాంతుఁ బొగడేటి చిత్తములో నున్నది॥తెలి॥
  
  
సురలవద్ద లేదు సోదించ నమృతము
సరి దిక్కులందు లేదు జలధిలో లేదు
శరణాగతుల పాతజలములు చేర్చికొనే
హరిదాసులఁ బూజించే అరచేత నున్నది॥తెలి॥
  
  
రాజసాన సుఖమేది రాసి కర్మమందు నేది
వోజతోడ నియతుఁడై వుండేవానిది
సాజాని శ్రీవేంకటేశు సరిముద్రలు ధరించే
తేజముతో విజ్ఞానదేహములో వున్నది॥తెలి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!