Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9274

తొల్లిటివారికంటే దొడ్డ నేను పాతకాన

రాగము: ముఖారి

తొల్లిటివారికంటే దొడ్డ నేను పాతకాన
బల్లిదుఁడ వగుటకుఁ బ్రతాపమిదివో॥పల్లవి॥
  
  
నరహరి యచ్యుత వో నారాయణా
గురుఁడు నిన్నుఁ గొండించెఁ (?) గోరి నే వింటి
గరిమ నొక్కతప్పున కాకికిఁ బరమిచ్చితి
సిరులఁ బెక్కుతప్పులు సేసితి నేమిచ్చేవే॥తొల్లి॥
  
  
మందరధరుఁడ వో మధుసూదనా
అందరు నిన్నొకమాఁట ఆడఁగా వింటి
నింద కొకటి బొంకితే నీవు ధర్మజుఁ గూడితి
వంది పెక్కుబొంకుల నాయందుఁ గూటమెంతో॥తొల్లి॥
  
  
శ్రీవేంకటేశ్వర శ్రీసతీమనోహర
సేవ నీదాసులే నిన్ను చేతఁ జూపేరు
మోవ నొక్క శునకము మొర యాలించితివట
వేవేలు జన్మాలెత్తితి యీవిధ మెట్లాలించేవో॥తొల్లి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!