Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9306

దక్కె నీకుఁ బంతము తగిలినప్పుడె నేము

రాగము: లలిత

దక్కె నీకుఁ బంతము తగిలినప్పుడె నేము
మొక్కితిమిట్టె నీతో మొక్కలము లొల్లము॥పల్లవి॥
  
  
కూరిమినైనాఁ గాని కోపాననైనాఁ గాని
వూరకే నీమోము చూడకుండలేమురా
చేరి యిట్టె పట్టరాని చిత్తమువారము నేము
యేరీతినైనాఁ జేయుమిఁకనేల మాటలు॥దక్కె॥
  
  
తత్తరానకైనాఁ గాని తగవునకైనాఁ గాని
వొత్తి నిన్నుఁ బిలువక వుండలేమురా
చిత్తిణిగుణాన నీకే చిక్కినవారము నేము
వుత్తరువు నీకునిదె వొద్దనే వున్నారము॥దక్కె॥
  
  
నగవునకైనాఁ గాని నాటకానకైనాఁ గాని
వొగి నిన్నుఁగూడక వుండలేమురా
చిగురుఁబాయమునాఁడే సేసవెట్టితిమి నేము
మిగుల శ్రీ వేంకటేశ మెచ్చితి నిన్నిపుడు॥దక్కె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!