Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9310

దగ్గరగ రాదు మరి దగ్గరకుండగ రాదు

రాగము: ఆహిరి

దగ్గరగ రాదు మరి దగ్గరకుండగ రాదు
యెగ్గులాయ జవ్వనము యిఁకనేఁటికే॥పల్లవి॥
  
  
చేరి వానిరూపు చూచి జిగి సంతోసించేనంటే
సారె నాకన్నులనీరు సంగరమాయ
ఆరయ వానితో మాటలాడి చొక్కేనంటేను
దూరేనానవ్వులే నాకుఁ దొడసాయెనే॥దగ్గ॥
  
  
మునప వానింటికేఁగి ముచ్చటఁ బాసేనంటే-
ననువైనమరపులే అడ్డమాయెనే
తనివోక వానిరతి తలపోసివుండేనంటే
కొనసాగి కోరిక పైకొసరాయెనే॥దగ్గ॥
  
  
గక్కన వానిమేను కాఁగిలించి పట్టేనంటే
పక్కన నాసిగ్గులు దెప్పరమాయెనే
ఇక్కువ శ్రీవేంకటేశు నిట్టె నేఁ గూడితిని
దక్కిన వాని మన్నన తలకూడెనే॥దగ్గ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!